పత్రాలు

Wednesday, February 4, 2015



పాపాయి
కాలిపై కాలు, నోటిలో వ్రేలు
పద్మనాభునికి ప్రతిగా, భువన యోగిగా
ప్రసావాబ్దినీదివచ్చిన పరలోకి
తన ఇంటికి కొంగ్రొత్త చిన్న కాపు
బొటనవ్రేలే నీ ప్రపంచమంటే నవ్వొచ్చింది, ఇంత చిన్నదా నీ ప్రపంచమని
బొటనవ్రేలితో ప్రపంచాన్నానందిస్తావంటే  నమ్మలేక పోయాను
చూసినపుడనిపించింది అది ముమ్మాటికీ నిజమని, అది మాత్రమే నిజమని
కస్తూరీ తిలకం, లలాట ఫలకం
వక్షస్థల కౌస్తుభం, నాసాగ్రపు మౌక్తికం
చేతుల కంకణాలు, కాళ్ళ కడియాలు
బంగారు మొలతాడు, వెండి తాయత్తు   
పాల బుగ్గలు, పసిడి నవ్వులు  
ముక్కు  పచ్చలు, లేలేత ముంగురులు 
మౌన ముద్రలు, ముద్దు మోములు
గిలకతో ముచ్చట్లు, గాలిలో గానాలు   
అమ్మకోసం  ఏడుపులు, ఆకలై కేకలు
ఎంగిలి పాల పెదవులు, బోసి నోటి నవ్వులు
అరమోడ్పు కన్నులు, విల్లంటి కనుబొమలు
ఉయ్యలలో వూగిసలు, అమ్మనోట  జోజో లు
అమ్మ చేతి ముద్దలు, చప్పరించు పెదవులు
మరువగలరా నీ అందం ఎవరైనా, మరచి మనగాలరా ఎపుడైనా? ఎక్కడైనా?
నీ మాత్రు క్షీర మధురామ్రుతాన్నం, మా మ్రుస్టాన్నభోజనాలనెక్కిరిస్తుంది
నీ సామీప్య పాల సుగంధం ముందు కస్తూరీ పరిమళాలు విస్తుపోతాయి
నీ కంటి కమలాలను చూసి పారిజాతం నివ్వెరపోతుంది... అవాక్కవుతుంది
నీ  మెలితిరిగిన పసి కండలు వస్తాదుల ఆరు మడతలు
అమ్మ పాట నాలింపక నిద్దురాడని నీ రాజసం
ఉయ్యాల దిగనట్టి నీ భాగ్యోన్నతత్వం 
పరికించి చూసినపుడనిపిస్తుంది.. నీవు వసుపతివని
మా పరపతివని, మా కులపతివని
మాయలేని నీ నగుమోము పశుపతిని తలపిస్తుంది            
శహభాష్… పాపాయి…శహభాష్
పికాసో నినుగాంచే గ్రీకు శిల్పం చెక్కుంటాడు
బాపుగారు నినుచూసే బుడుగును గీసుంటారు
ప్రపంచాస్వాదనకు నీకు బొటనవ్రేలు,మాకు స్మార్ట్ ఫోను… భలే! పాపాయి భలే!భలే!
అపుడెపుడో నాళం వారి ఆటవెలదిగా ఆటలు, జాషువా గారి సీసంలో లాస్యాలు
ఛందోరహిత ఆధునిక కైతగా ఇపుడు నా దగ్గర దర్జాలు
పాపాయి, జయము జయము, నీకు విజయ జయము
నీ  విజయము  సదా  నిజము
జో అచ్చుతానంద జో జో ముకుందా
రార  పరమానంద  రామ  గోవిందా
జో… జో… జో… జో… జో… జో…
 అమ్మ కౌగిట పంజరపు చిలుక
మా ఇంటి శిశువుగా నువ్వు
ఛుక్ ఛుక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి
ఆగినాక  ఎక్కండి, జో  జో  పాపాయి  ఏడవకు
ఏడిస్తే  నీకళ్ళు  నీలాలు  కారు … నీలాలు కారితే నే చూడలేను…
పాపాయి, జయము  జయము , నీకు  విజయ  జయము



No comments:

Post a Comment