పత్రాలు

Wednesday, February 4, 2015

మా గణితం మా’స్టారు’
Sine అంటాడు, Cos అంటాడు
 Pi అంటాడు, e అంటాడు
Step అంటాడు, Mod అంటాడు
Log అంటాడు, Power అంటాడు
మా గణితం మాస్టారు
ప్రశ్నలనే ప్రశ్నిస్తాడు, Rigour కోసమే తానంటాడు
Fallacy లనే చెపుతుంటాడు, Paradox లు సృష్టిస్తాడు
కోణాల్లోనే చూస్తుంటాడు, ఆకాశంలో రాస్తుంటాడు 
కాలం కల్పన కాదంటాడు, విశ్వం మితి 4 అంటాడు
సరళరేఖలా ప్రసరిస్తాడు, వృత్తంలా వ్యాపిస్తాడు
దీర్ఘవృత్తమై దీపిస్తాడు, పరావలయమై పయనిస్తాడు
సంఖ్యలనే పూజిస్తాడు, లెక్కించకనే లెక్కిస్తాడు
సంఖ్యల సాంద్రత నిజమంటాడు, సంఖ్యలె వేదం అంటాడు
ఏమీ లేదనవద్దంటాడు, సున్నా వుందనమంటాడు 
తెలియనిదేమో x అంటాడు, తెలిసందంతా y అంటాడు
Y తో x ని రప్పిస్తాడు, దాగిన సత్యం చూపిస్తాడు
చూడక లోతులు చూసొస్తాడు, కొలవక ఎత్తులు కొలిచేస్తాడు
నీడల వడులు కట్టేస్తాడు, జాడల జీవం పట్టేస్తాడు
తిరగకనే తిరిగొస్తాడు, విశ్వం కొలతలు చెప్పేస్తాడు
లెక్కించకనే లెక్కిస్తాడు, లోపాలన్నీచూపిస్తాడు
మిధ్యా లోకం ఉందంటాడు, వాస్తవ లోకం మనదంటాడు
యూలర్ గారిని పిలిపిస్తాడు, i లో దానిని చూపిస్తాడు
వాస్తవ లోకం, మిధ్యా లోకం
గజి బిజి బిజి గజి మాస్టారు, గందరగోళం మాస్టారు
పొడవు వెడల్పుఎత్తుల భాష, ఫార్ములాలంటూ ఎపుడూ గోల
వ్యాసార్దాలు, వైశ్యాలాలు, కోణాలు, ఘన పరిమాణాలు
కోణమానిని తో వృత్త లేఖిని తో విన్యాసాలు 
గణిత లోకమే మాస్టారు, పిచ్చిమాలోకం మా మాస్టారు
ఆల్ఫా , బీటా, గామా లంటూ ఏవో రాతలు రాస్తుంటాడు
గీతలు, గ్రాఫులు గీస్తుంటాడు గాలిలో మేడలు కడ్తుంటాడు   
నలుపును తెలుపును ప్రేమిస్తాడు
నలుపును తెలుపుగ మార్చేస్తాడు
తెలుపుతొ నలుపును దులిపేస్తాడు 
తెలుపులో దాగిన రంగులనన్నీచూపిస్తాడు
Russel గారి మేథమేటికా, Hardy గారి సంఖ్యా శాస్త్రం
Hall and Stewens జ్యామితి గీత, SL Loney కంప్లీట్ వర్క్స్
లైబ్నిట్జ్, న్యూటన్ Calculus, స్మిత్ గారి Conic sections
ఎట్సెట్రాలు, ఎట్సెట్రాలు చదవాలంటూ చదివిస్తాడు
వరమేమని దైవమదిగితే సుద్ద ముక్క చాలంటాడు
నల్లబోర్డు ఇమ్మంటాడు, వెర్రి బాగులా మాస్టారు
మా బంగరు గణితం మాస్టారు, మా గణితం బంగారు మా “స్టారు”

గజవల్లి పవన్ కుమార్
                                                                                      9246649522

pavan_padma97@yahoo.co.in

No comments:

Post a Comment