పత్రాలు

Wednesday, February 4, 2015





పాపాయి
కాలిపై కాలు, నోటిలో వ్రేలు
పద్మనాభునికి ప్రతిగా, భువన యోగిగా
ప్రసావాబ్దినీదివచ్చిన పరలోకి
తన ఇంటికి కొంగ్రొత్త చిన్న కాపు
బొటనవ్రేలే నీ ప్రపంచమంటే నవ్వొచ్చింది, ఇంత చిన్నదా నీ ప్రపంచమని
బొటనవ్రేలితో ప్రపంచాన్నానందిస్తావంటే  నమ్మలేక పోయాను
చూసినపుడనిపించింది అది ముమ్మాటికీ నిజమని, అది మాత్రమే నిజమని
కస్తూరీ తిలకం, లలాట ఫలకం
వక్షస్థల కౌస్తుభం, నాసాగ్రపు మౌక్తికం
చేతుల కంకణాలు, కాళ్ళ కడియాలు
బంగారు మొలతాడు, వెండి తాయత్తు   
పాల బుగ్గలు, పసిడి నవ్వులు  
ముక్కు  పచ్చలు, లేలేత ముంగురులు 
మౌన ముద్రలు, ముద్దు మోములు
గిలకతో ముచ్చట్లు, గాలిలో గానాలు   
అమ్మకోసం  ఏడుపులు, ఆకలై కేకలు
ఎంగిలి పాల పెదవులు, బోసి నోటి నవ్వులు
అరమోడ్పు కన్నులు, విల్లంటి కనుబొమలు
ఉయ్యలలో వూగిసలు, అమ్మనోట  జోజో లు
అమ్మ చేతి ముద్దలు, చప్పరించు పెదవులు
మరువగలరా నీ అందం ఎవరైనా, మరచి మనగాలరా ఎపుడైనా? ఎక్కడైనా?
నీ మాత్రు క్షీర మధురామ్రుతాన్నం, మా మ్రుస్టాన్నభోజనాలనెక్కిరిస్తుంది
నీ సామీప్య పాల సుగంధం ముందు కస్తూరీ పరిమళాలు విస్తుపోతాయి
నీ కంటి కమలాలను చూసి పారిజాతం నివ్వెరపోతుంది... అవాక్కవుతుంది
నీ  మెలితిరిగిన పసి కండలు వస్తాదుల ఆరు మడతలు
అమ్మ పాట నాలింపక నిద్దురాడని నీ రాజసం
ఉయ్యాల దిగనట్టి నీ భాగ్యోన్నతత్వం 
పరికించి చూసినపుడనిపిస్తుంది.. నీవు వసుపతివని
మా పరపతివని, మా కులపతివని
మాయలేని నీ నగుమోము పశుపతిని తలపిస్తుంది            
శహభాష్… పాపాయి…శహభాష్
పికాసో నినుగాంచే గ్రీకు శిల్పం చెక్కుంటాడు
బాపుగారు నినుచూసే బుడుగును గీసుంటారు
ప్రపంచాస్వాదనకు నీకు బొటనవ్రేలు,మాకు స్మార్ట్ ఫోను… భలే! పాపాయి భలే!భలే!
అపుడెపుడో నాళం వారి ఆటవెలదిగా ఆటలు, జాషువా గారి సీసంలో లాస్యాలు
ఛందోరహిత ఆధునిక కైతగా ఇపుడు నా దగ్గర దర్జాలు
పాపాయి, జయము జయము, నీకు విజయ జయము
నీ  విజయము  సదా  నిజము
జో అచ్చుతానంద జో జో ముకుందా
రార  పరమానంద  రామ  గోవిందా
జో… జో… జో… జో… జో… జో…
 అమ్మ కౌగిట పంజరపు చిలుక
మా ఇంటి శిశువుగా నువ్వు
ఛుక్ ఛుక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి
ఆగినాక  ఎక్కండి, జో  జో  పాపాయి  ఏడవకు
ఏడిస్తే  నీకళ్ళు  నీలాలు  కారు … నీలాలు కారితే నే చూడలేను…
పాపాయి, జయము  జయము , నీకు  విజయ  జయము




మసాలా మంత్రగాడు
అతడొక మంత్రగాడు
రైల్వేస్టేషన్, బస్సుస్టేషన్, సినిమాహాలు, పబ్లిక్ పార్కు మనవాడికి చిరునామాలు
నా ప్రతి సాయంత్రపు సంధ్య ప్రయాణంలో అతడొక మజిలీ
నా కళ్ళు అతనికోసం అప్రయత్నంగా వెతుకుతాయి
సూర్యుడికి వీడ్కోలంటూ చంద్రునికి స్వాగతం చెపుతూ
సహజంగా అతని మంత్రవిద్య ప్రారంభమవుతుంది
మూడుకర్రల వెదురుకుర్చీ అతని మంత్రాలకు వేదికవుతుంది
కొండెక్కినట్టుండే దీపపు కిరోసిన్ చిమ్నీ
ఒలంపిక్ క్రీడల ప్రారంభపు కాగడా అవుతుంది
ముంతలోని మంటని చూసినపుడతడు నిత్యాగ్నిహోత్రుడనిపిస్తాడు
కాగితం అతని దగ్గర శంకువవుతుంది 
మురమురాలతని దగ్గర ముత్యాలవుతాయి
చేయంత మురమరాలు, ఉడకేసిన శనగలు
వేయించిన పల్లీలు, కరకరలాడే బఠానీలు,
కూసింత కరివేపాకు, కాసింత కొత్తిమీరి
చిటికెడు ఉప్పు, వేలిచివర వెలిగారమ్,
గుప్పెడంత ఉల్లిముక్కలు, గిలకరించిన నిమ్మరసం
అతని చేతి లాఘవం అబ్బురమనిపిస్తుంది
మెలి తిరిగిన చెయ్యేమిటో కళ్ళెదుటే కనిపిస్తుంది
చిత్రంగా విచిత్రంగా సూక్ష్మంలో మోక్షం అవగతమవుతుంది
ఆహుతుల నోళ్ళన్నీ నీళ్ళ చెలమలవుతాయి
అద్భుతం ఆవిష్కృతమవుతుంది, నలభీమం తయారవుతుంది     
అరక్షణంలో అమృతం, అయుదు రూపాయల షడ్రసోపేతం 
అతనిచ్చే తాటాకు ముక్క లు స్టీలు చెంచాలను వెక్కిరిస్తాయి
అతని మంత్రక్షేత్రంలో అడుగు పెట్టారా ?….
చాలిక, మీ నాసిక మీ నడకనతని వైపు శాసిస్తుంది
మీరు సైతం జఠరాగ్నికి అల్పాహారమొక్కటి ఆహుతిస్తారు
ఏమైనా అతనొక మనిషంటు రాయి 
నా ప్రతి సాయంత్రపు నేస్తం, మధ్యతరగతి చిరుదరహాసం
గజవల్లి పవన్ కుమార్
                                                                                      9246649522
pavan_padma97@yahoo.co.in

మా గణితం మా’స్టారు’
Sine అంటాడు, Cos అంటాడు
 Pi అంటాడు, e అంటాడు
Step అంటాడు, Mod అంటాడు
Log అంటాడు, Power అంటాడు
మా గణితం మాస్టారు
ప్రశ్నలనే ప్రశ్నిస్తాడు, Rigour కోసమే తానంటాడు
Fallacy లనే చెపుతుంటాడు, Paradox లు సృష్టిస్తాడు
కోణాల్లోనే చూస్తుంటాడు, ఆకాశంలో రాస్తుంటాడు 
కాలం కల్పన కాదంటాడు, విశ్వం మితి 4 అంటాడు
సరళరేఖలా ప్రసరిస్తాడు, వృత్తంలా వ్యాపిస్తాడు
దీర్ఘవృత్తమై దీపిస్తాడు, పరావలయమై పయనిస్తాడు
సంఖ్యలనే పూజిస్తాడు, లెక్కించకనే లెక్కిస్తాడు
సంఖ్యల సాంద్రత నిజమంటాడు, సంఖ్యలె వేదం అంటాడు
ఏమీ లేదనవద్దంటాడు, సున్నా వుందనమంటాడు 
తెలియనిదేమో x అంటాడు, తెలిసందంతా y అంటాడు
Y తో x ని రప్పిస్తాడు, దాగిన సత్యం చూపిస్తాడు
చూడక లోతులు చూసొస్తాడు, కొలవక ఎత్తులు కొలిచేస్తాడు
నీడల వడులు కట్టేస్తాడు, జాడల జీవం పట్టేస్తాడు
తిరగకనే తిరిగొస్తాడు, విశ్వం కొలతలు చెప్పేస్తాడు
లెక్కించకనే లెక్కిస్తాడు, లోపాలన్నీచూపిస్తాడు
మిధ్యా లోకం ఉందంటాడు, వాస్తవ లోకం మనదంటాడు
యూలర్ గారిని పిలిపిస్తాడు, i లో దానిని చూపిస్తాడు
వాస్తవ లోకం, మిధ్యా లోకం
గజి బిజి బిజి గజి మాస్టారు, గందరగోళం మాస్టారు
పొడవు వెడల్పుఎత్తుల భాష, ఫార్ములాలంటూ ఎపుడూ గోల
వ్యాసార్దాలు, వైశ్యాలాలు, కోణాలు, ఘన పరిమాణాలు
కోణమానిని తో వృత్త లేఖిని తో విన్యాసాలు 
గణిత లోకమే మాస్టారు, పిచ్చిమాలోకం మా మాస్టారు
ఆల్ఫా , బీటా, గామా లంటూ ఏవో రాతలు రాస్తుంటాడు
గీతలు, గ్రాఫులు గీస్తుంటాడు గాలిలో మేడలు కడ్తుంటాడు   
నలుపును తెలుపును ప్రేమిస్తాడు
నలుపును తెలుపుగ మార్చేస్తాడు
తెలుపుతొ నలుపును దులిపేస్తాడు 
తెలుపులో దాగిన రంగులనన్నీచూపిస్తాడు
Russel గారి మేథమేటికా, Hardy గారి సంఖ్యా శాస్త్రం
Hall and Stewens జ్యామితి గీత, SL Loney కంప్లీట్ వర్క్స్
లైబ్నిట్జ్, న్యూటన్ Calculus, స్మిత్ గారి Conic sections
ఎట్సెట్రాలు, ఎట్సెట్రాలు చదవాలంటూ చదివిస్తాడు
వరమేమని దైవమదిగితే సుద్ద ముక్క చాలంటాడు
నల్లబోర్డు ఇమ్మంటాడు, వెర్రి బాగులా మాస్టారు
మా బంగరు గణితం మాస్టారు, మా గణితం బంగారు మా “స్టారు”

గజవల్లి పవన్ కుమార్
                                                                                      9246649522

pavan_padma97@yahoo.co.in

Saturday, August 7, 2010

బుజ్జాయి కోసం

తెలుగు తల్లుల్లారా, ఇదిగో మీ చిన్నారి కోసం ఒక చిన్న బాల గేయం.

చిన్న పిల్లి చిన్న పిల్లి వచ్చిపోయింది
మాఇంట్లో పాలన్నితాగిపోయింది
చిన్న పిల్లి ఢాం ఢాం చిన్న పిల్లి ఢాం ఢాం
చిన్న పిల్లి ఢాం ఢాం చిన్న పిల్లి ఢాం ఢాం
అల్లరి కోతి అల్లరి కోతి వచ్చి పోయింది
మా మామ్మ కళ్ళజోడు తీసుకెళ్ళింది
అల్లరి కోతి ఢాం ఢాం అల్లరి కోతి ఢాం ఢాం
అల్లరి కోతి ఢాం ఢాం అల్లరి కోతి ఢాం ఢాం
చిట్టి ఎలుక చిట్టి ఎలుక వచ్చిపోయింది
మాఇంట్లో బట్టలన్నీ కొరికి పోయింది
చిట్టి ఎలుక ఢాం ఢాం  చిట్టి ఎలుక ఢాం ఢాం
చిట్టి ఎలుక ఢాం ఢాం చిట్టి ఎలుక ఢాం ఢాం
మేక పిల్ల మేక పిల్ల వచ్చిపోయింది
పెరటి లోని మొక్కలనేమో తొక్కి పోయింది
మేక పిల్ల ఢాం ఢాం మేక పిల్ల ఢాం ఢాం
మేక పిల్ల ఢాం ఢాం మేక పిల్ల ఢాం ఢాం
చిట్టి చిలుక చిట్టి చిలుక వచ్చిపోయింది
మా పెరటి జామకాయలు కొరికి పోయింది
గున్న ఏనుగు గున్న ఏనుగు వచ్చిపోయింది
ప్రక్క వీధిలోనేమొ తిరిగి పోయింది
గున్న ఏనుగు ఢాం ఢాం గున్న ఏనుగు ఢాం ఢాం
గున్న ఏనుగు ఢాం ఢాం గున్న ఏనుగు ఢాం ఢాం
చిట్టి చిలుక ఢాం ఢాం చిట్టి చిలుక ఢాం ఢాం
చిట్టి చిలుక ఢాం ఢాం చిట్టి చిలుక ఢాం ఢాం
చిన్ని కుక్క చిన్ని కుక్క వచ్చిపోయింది
అమ్మ పెట్టిన అన్నమేమొ తినిపోయింది
చిన్ని కుక్కకు జై జై చిన్ని కుక్క  కు జై జై
చిన్ని కుక్కకు జై జై చిన్ని కుక్క కు జై జై
తెల్ల ఆవు తెల్ల ఆవు వచ్చి పోయింది
నాన్న తెచ్చిన లేత గడ్డి తినిపోయింది
తెల్ల ఆవుకు జై జై తెల్ల ఆవుకు జై జై
తెల్ల ఆవుకు జై జై తెల్ల ఆవుకు జై జై
గంగిరెద్దు గంగిరెద్దు వచ్చి పోయింది
మామ్మ ఇచ్చిన ఇనామేమో తీసుకెళ్ళింది
గంగిరెద్దుకు జై జై గంగిరెద్దుకు జై జై
గంగిరెద్దుకు జై జై గంగిరెద్దుకు జై జై
చెవులపిల్లి చెవులపిల్లి వచ్చి పోయింది
తాత విసిరిన క్యారట్లు తినిపోయింది
చెవులపిల్లికి జై జై చెవులపిల్లికి జై జై
చెవులపిల్లికి జై జై చెవులపిల్లికి జై జై
ఎలుగు పిల్ల ఎలుగు పిల్ల వచ్చి పోయింది
మా ఇంటి దగ్గరెమో గారడి చేసింది
ఎలుగు పిల్లకు జై జై ఎలుగు పిల్లకు జై జై
ఎలుగు పిల్లకు జై జై ఎలుగు పిల్లకు జై జై

Friday, August 6, 2010

కధ చెపుతాను వూ కొడతారా...ఒకటి

ఏం చేద్దాం ఇది కలికాలం కదా. నమ్మిన వాళ్ళే మోసం చెసే కాలం. ఈ కధలో కథా నయకుఢు భూనాధ్. ప్రతి నాయకుడు మన ప్రభుత్వం. కలియుగం కనుక విజయం ప్రతి నాయకునిదే. ఆఛ్చర్యపొకండి. సత్య, త్రెతా, ద్వాపర యుగాల్లో విజయం కథానాయకులది మరి కలియుగంలో విజయం ప్రతి నాయకులది. మరువకండి కథానా యకులు గెలిచేది చలన చిత్రాల్లోనే కాని వాస్తవాల్లోకాదు. అందుకే ఎక్కువమంది చలన చిత్రాలు బహుగా చూస్తుంటారని నాకనిపిస్తుంది. ఇక కథలోకి...., వినండి.

మనకథానయకుడిది, ఒక చిన్న పల్లెటూరు. పుట్టగానే మన వాడికి ఏం పేరు పెట్టాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. తల్లిదండ్రుల తీరని కోర్కెలని తీర్చేవాళ్ళు పిల్లలని ఎవరో చెప్పారు. ఇకనేం మనవాళ్ళకు భూమి లేదనే తీరని కోరిక ఒకటుంది, అంచేత మనవాడికి భూనాద్ అనే పేరు ఖరారు చేశారు. చిన్నగా మనవాడు పెద్దవాడవుతున్నాడు. మనవాడిని సార్ధకనామదేయున్ని చేయడానికి రోజుకొక గొప్పవారి కధలన్నీ చెప్పడం ప్రారంభించారు తల్లిదండ్రులు. మనవాడు క్షణ క్షణ ప్రవర్ధమానుడవుతున్నాడు. తరగతి గదిలో కూడా అమనవాడికి రుచ్యమైన విషయం భూగోళ శాస్త్రమే.